కేసిఆర్‌కు థాంక్స్ చెప్పిన చిరంజీవి

Telugu Lo Computer
0


తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ పెంచుకునే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి థాంక్స్ చెప్పారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగాయని టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. అందుకు సానుకూలంగా స్పందించి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. "తెలుగు సినిమా పరిశ్రమ కోరికను మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యాలకు... అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్‌ గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది" అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)