సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ వినోద్ కాంబ్లి !

Telugu Lo Computer
0


ఈనెల 3న వినోద్ కాంబ్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసిన ఓ వ్యక్తి కేవైసీ వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని, లేకుంటే క్రెడిట్, డెబిట్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన కాంబ్లి.. కేవైసీ అప్ డేషన్ కోసం తన మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేశాడు. అంతే వినోద్ కాంబ్లి బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ.1.14లక్షలు మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అప్పుడుగానీ తాను మోసపోయినట్లు గుర్తించలేదాయన. ఎనీ డెస్క్ యాప్ ద్వారా అవతలి వ్యక్తి సిస్టమ్ ను పూర్తిగా అదుపులోకి తీసుకోవచ్చని తెలిసిందే. ఈ విషమై కాంబ్లి వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరాల విభాగం అప్రమత్తమై, కాంబ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సత్వరమే బ్యాంక్ అధికారులను సంప్రదించారు. కాంబ్లి అకౌంట్ నుంచి ఏ అకౌంట్ లోకి డబ్బులు బదిలీ అయ్యాయో గుర్తించి, రివర్స్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆ డబ్బును తిరిగి కాంబ్లి అకౌంట్ లోనే జమ చేశారు. పోయిందనుకున్న డబ్బు తిరిగిరావడంతో కాంబ్లీ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభించే అవశాలుంటాయని పోలీసులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)