పెళ్లి పీటలెక్కబోతున్న నిత్యా మీనన్ ?

Telugu Lo Computer
0


నిత్యా మీనన్ సినీ ఇండస్ట్రీలో తన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. సినిమా అవకాశాలు ఎక్కువగా రావు. వచ్చినా కూడా అవి చిన్నా, చితకా సినిమాలే. అందుకే ఇప్పుడు నిత్యామీనన్ మనసు పెళ్లి వైపు మళ్ళిందట. ఎలాగో తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. దీనికి తోడు తాజాగా ఆమే నిర్మాతగా కూడా మారింది. అయినా కూడా ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదు. అందుకే త్వరలో నిత్యామీనన్ పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే మరోవైపు ఇప్పటికే నిత్యా మీనన్ కి పెళ్లయిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ వార్తలకు బలం చేకూరేలా నిత్యామీనన్ ప్రవర్తిస్తోంది. నిజానికి ఇటీవల ఓ యంగ్ హీరోతో నిత్యామీనన్ చాలా కాలం డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని నిత్యా మీనన్ కూడా పలు సందర్భాల్లో ఇండైరెక్ట్ గా బయట పెట్టింది. కానీ ఆ యంగ్ హీరో ఇదివరకే పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు నిత్యామీనన్ కూడా పెళ్ళి పై సీరియస్ గా ఫుల్ ఫోకస్ పెట్టిందట. నిజానికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగాలని నిత్యామీనన్ ముందు ప్లాన్ చేసుకుంది. కానీ ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు.అందుకే కొన్నాళ్ల కిందే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట. ఈ క్రమంలోనే నిత్యా మీనన్ కి చెన్నైలోని ఓ వ్యాపార వేత్తతో పెళ్లి ఫిక్స్ అయిందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇ ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే వరకూ ఆగాల్సిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)