చేపల వేటకు వెళ్లి నలుగురు మృతి

Telugu Lo Computer
0


విశాఖ ఏజెన్సీ లోని గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు (35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు. వీరు నలుగురు కలిసి బొంతు వలస కాలువ లో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రవాహం బాగా పెరిగింది. అక్కడ ఊబి ఉందని తెలియక, నలుగురు ఒక్కసారిగా దిగడంతో అక్కడికక్కడే మృతి చెందారుజ. వారితో వచ్చిన మరో ఒక చిన్నారి ఒడ్డు పైన ఉండడంతో ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారి జరిగిన ప్రమాదం గురించి చాపరాతి పాలెం గ్రామస్తులకు చేరవేసింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అన్వేషించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ఇద్దరు కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. అయితే అప్పటికే చీకటి పడటంతో మరొక వ్యక్తి జాడ తెలియలేదు. సోమవారం తెల్లవారుజామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న జీకేవీధి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పంచనామా చేపట్టారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)