కోట్లు పెట్టినా దొరకని సంతోషం !

Telugu Lo Computer
0



ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్‌ పోలీస్‌ యూనిఫామ్‌ ధరించి.. తన పైఅధికారి ఐటీబీపీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఏపీఎస్‌ నింబాడియాకి సెల్యూట్‌ చేయగా.. ఆయన తిరిగి సెల్యూట్‌ చేశారు. ఇలా ఒకరినొకరు సెల్యూట్‌ చేసుకున్నది తండ్రి, కుమార్తె కావడం గమనార్హం. ఇలా వారిద్దరూ పరేడ్‌లో సెల్యూట్‌ చేసుకునే సమయంలో.. ఫోటో క్లిక్‌ మనిపించారు. ఈ ఫొటోని ఐటీబీపీ విభాగం తన సోషల్‌ మీడియా షేర్‌ చేసింది. దీనికి ''కుమార్తె సెల్యూట్‌ చేయడంతో.. తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు'' అని క్యాప్షన్‌ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోకి ఇప్పటివరకు 22వేల మందికిపైగా లైక్‌ చేశారు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు.. ''తనయోత్సాహం.. ఆ తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు.. అపురూప క్షణాలు'' అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఆపేక్షా నింబాడియా సివిల్‌ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్‌పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి కుటుంబం నుంచి మూడోతరం వారు కూడా పోలీస్‌ విభాగంలో సేవ చేయడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)