స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 October 2021

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.271 తగ్గి రూ.46,887కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం నాణ్యమైన బంగారం ధర రూ.47,158 దగ్గర ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు తగ్గడమే దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.687 తగ్గి రూ.63,210కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.63,897 దగ్గర ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,795 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.89 అమెరికన్ డాలర్లు పలికింది.

No comments:

Post a Comment