హీరో రామ్ కు మెడకు గాయం

Telugu Lo Computer
0


టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని తీవ్ర గాయం అయింది.ఉదయం జిమ్ లో వర్కౌట్స్‌ చేస్తుండగా రామ్‌  మెడకు గాయమైంది. దీంతో… రామ్‌ మెడకు వైద్యులు పట్టి కట్టారు. హీరో రామ్‌ గాయపడటంతో ఇవాళ జరిగే సినిమా షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక నెక్‌ బ్యాండ్‌ తో ఉన్న ఫోటోను కూడా ట్వీట్‌ చేశాడు హీరో రామ్‌. చిన్న గాయంతో ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటున్నానని రామ్‌ పేర్కొన్నారు. త్వరలోనే డబుల్‌ ఎనర్జీతో మీ ముందుకు వస్తానని చెప్పాడు రామ్‌. కాగా…ప్రస్తుతం హీరో రామ్ పోతినేని… దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ర్యాపో 19 పేరుతో ఈ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం.

Post a Comment

0Comments

Post a Comment (0)