టెక్సాస్ లో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు

Telugu Lo Computer
0

 



ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ టెస్లా కంపెనీ హెడ్‌ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్‌ మార్కెట్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. అక్టోబర్ 7న జరిగిన షేర్‌హోల్డర్స్‌ వార్షికోత్సవం సమావేశంలో కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ ఊహించని ఈ ప్రకటన చేశాడు. ఎలన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా టెస్లా నిర్మించబోయే గిగాఫ్యాక్టరీ చుట్టూ గృహా ధరలు భారీగా పెరిగాయి. గిగా ఫ్యాక్టరీ నిర్మించే టెక్సాస్ లోని ట్రావిస్ కౌంటీలో ఇంటి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 53.7% పెరిగాయి. మొత్తం టెక్సాస్ లోని ఆస్టిన్‌తో పోలిస్తే ఇది 26% కంటే ఎక్కువ. టెస్లా సైబర్ ట్రక్, సెమీ ట్రక్, మోడల్ 3 & వై కోసం 5 మిలియన్ చదరపు అడుగుల కర్మాగారం అవసరం. అందుకే ఇక్కడ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇన్ సైడర్ ప్రకారం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు గంటకు $15 ప్రారంభ వేతనంతో 5,000 మంది నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టెస్లా తెలిపింది. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చేసిన ప్రకటనతో ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకానికి ఉన్న గృహాలు ధరలు రాకెట్ వేగంతో పెరగడం ప్రారంభించాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)