తీహార్‌ జైల్లో గ్యాంగ్‌స్టర్‌ హత్య

Telugu Lo Computer
0



అంకిత్ గుజ్జర్(29) ఉత్తర ప్రదేశ్ బాగ్‌పత్‌లోని ఖేలా గ్రామానికి చెందినవాడు. అతడిపై హత్య, దోపిడీతో సహా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. తీహార్ జైలు సూపరింటెండెంట్ నరేందర్ మీనాతో అంకిత్ గుజ్జర్ గొడవ పడినట్లు సమాచారం. దీంతో అతడిని జైలులో వేరే గదికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చెంపదెబ్బ కొట్టుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. దీంతో నరేందర్ మీనా, ఇతర జైలు అధికారులు కలిసి అంకిత్ గుజ్జర్, ఇద్దరు సహచర ఖైదీలను 50 కర్రలతో కొట్టారు. అంకిత్ గుజ్జర్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతడిని డీడీయూ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ జైలు సూపరింటెండెంట్ అతడిని అక్కడికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. అంకిత్ గుజ్జర్‌కి పెయిన్ కిల్లర్ ఇవ్వడంతో.. అతడు మరణించినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. కానీ అతని శరీరం మీద తీవ్రమైన గాయాలు ఉన్నట్లు శవపరీక్షలో తేలింది. ఇక నిందితుడు ముందుగానే సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)