పోలీసే మద్యం స్మగ్లర్ ?

Telugu Lo Computer
0


పోలీసు శాఖలో ఇంటి దొంగ పట్టుబడ్డాడు. గుట్టు చప్పుడు కాకుండా మద్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఈరోజు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ ప్లాంటులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ నిర్వాకంతో స్థానిక పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది అవాక్కయ్యారు. ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఈ స్మగ్లింగ్ రాకెట్ ను పోలీసులు పట్టుకుని, సంబంధిత గుట్టును రట్టు చేశారు.  ఖాళీ పెట్టెలను సీఐఎస్ ఎఫ్ స్టాంపు వేసి, ఎయిర్ పోర్టులో వాటితో పాటే ప్రయాణించి, దిల్లీకి చేరుకున్నాక, లోడ్ చేయించి, తిరుగు ప్రయాణంలో పెట్టెలతో సహా రైల్లో విశాఖకు చేరుకుని అనుమానం అన్నది రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. దిల్లీ , బదర్ పూర్ నుంచి విశాఖకు మద్యం దిగుమతి అవుతున్న మద్యం బాటిళ్లకు సంబంధించి అనుమానం వచ్చిన ఎస్ఈబీకి విస్తుబోయే నిజాలు తెలిశాయి. ట్రంకు పెట్టెలపై బాంబ్ స్క్వాడ్, సీఐ ఎస్ ఎఫ్ ముద్ర వేసి ఎన్ ఫోర్స్ మెంట్ వర్గాలకు మస్కా కొడుతున్న వైనాన్ని గుర్తించి పోలీసులే ఆశ్చర్యపోయారు. ట్రంక్ పెట్టెలపై ఫ్లైట్ ట్యాగ్ ఆధారంగా నిందితుడి గుర్తించిన ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు ఏపీ ఎక్స్ ప్రెస్ లో దిల్లీ మద్యం తరలిస్తున్నట్టు సమాచారం అందుకుని ఆర్పీఎఫ్ సహకారంతో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ట్రంక్ పెట్టెలపై ఫ్లైట్ ట్యాగ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని డీసీ తెలిపారు. ఫ్లైట్లో ఖాళీ బాక్సులను తీసుకెళ్ళి.. ట్రైన్లో అక్కడి నుంచి పంపాడని ప్రాథమిక విచారణలో తేలింది అని, 143 పెట్టెల్లో దిల్లీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్  చేశామని చెప్పారు. పట్టుబడిన మద్యం నకిలీ మద్యమని అనుమానాలున్నాయి అని, వీటిని నిర్థారణ నిమిత్తం ల్యాబ్ కు పంపిస్తాం అని డీసీ తెలిపా రు.

Post a Comment

0Comments

Post a Comment (0)