త్వరలో మార్కెట్లోకి రానున్న ఆపిల్ కొత్త ఫోన్లు

Telugu Lo Computer
0


ఐఫోన్ 13 వచ్చే వారం జరిగే ఆపిల్ ఈవెంట్‌లో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఐఫోన్ 13 సిరీస్‌లోని ఫోన్ల స్టోరేజ్, కలర్ ఆప్షన్‌లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఉక్రేనియన్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీల వివరాలు పొందుపరిచారు. అలాగే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ని కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. కొత్త మోడల్ ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 14 సిరీస్‌లను ఆపిల్ 2022 లో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 మోడల్స్ లాంచ్ అయిన సంవత్సరం తరువాత ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్లను విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 14 ప్రో మాక్స్, ఐఫోన్ 14 ప్రోతో ఈ సిరీస్‌లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఫోన్లు అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీతో వస్తాయని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)