భారతీయుడికి రూ. 23.84 కోట్ల జాక్‌పాట్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 September 2021

భారతీయుడికి రూ. 23.84 కోట్ల జాక్‌పాట్ !

 


అబుధాబి బిగ్ టికెట్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఓ భారతీయున్ని అదృష్టం వరించింది.శుక్రవారం తీసిన బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది. రాస్ అల్ ఖైమాలో ఉండే భారత ప్రవాసుడు అబు మహమ్మద్ 12 మిలియన్ దిర్హమ్స్(రూ.23.84కోట్లు) గెలుచుకున్నాడు. ఆగస్టు 30న నలుగురు తోటి వాళ్లతో కలిసి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోయారు. ప్రతినెల 3వ తేదీన నిర్వహించే బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు జాక్ పాట్ తగిలింది. విజేతగా నిలిచిన మహమ్మద్‌కు హోస్ట్ రిచర్డ్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. దీంతో మహమ్మద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి మహమ్మద్‌.. రాస్ అల్ ఖైమాలో నివాసముంటున్నాడు. ఓ షిప్పింగ్ కంపెనీలో ఆపరేషన్స్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 30న తనతో పాటు అదే కంపెనీలో పని చేస్తున్న నలుగురు మిత్రులతో కలిసి మహమ్మద్ అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ ప్రైజ్‌మనీని అందరం సమానంగా పంచుకుంటామని ఈ సందర్భంగా మహమ్మద్ చెప్పాడు. ఏడాది కాలంగా ఈ ఐదుగురు కలిసి బిగ్ టికెట్ లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శుక్రవారం నిర్వహించిన బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం. 027700కు జాక్‌పాట్ తగిలింది. దీంతో 12 మిలియన్ దిర్హమ్స్(రూ.23.84కోట్లు) గెలుచుకున్నారు. 

No comments:

Post a Comment