వచ్చే రెండు నెలలు మరింత జాగ్రత్త అవసరం!

Telugu Lo Computer
0


దేశంలో కరోనా మహమ్మారి ఇంకా సంక్రమిస్తూనే ఉంది. పండుగల సీజన్ సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని పేర్కొనడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. ఒక్కోరోజు కేసుల సంఖ్య పెరుగుతూ..ఒక్కోరోజు తగ్గుతూ కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా పండుగల సీజన్ కావడంతో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే దేశంలోని కేసుల్లో సగం కేసులున్నాయి. ప్రస్తుతం కేరళలో లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)