అర్ధనగ్నంగా వీడియో కాల్

Telugu Lo Computer
0



తమిళనాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ జిల్లా నాయకురాలితో అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియో కాల్‌ను యూబ్యూబ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాఘవన్ రాజీనామా చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్రచేశారరని,  చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆయన అన్నారు. మదన్ రవిచంద్రన్ అనే బీజేపీ కార్యకర్త.. మదన్స్ డైరీ పేరిట యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారు. తన చానెల్‌లో రాఘవన్ వీడియోను విడుదల చేశారు. జిల్లా మహిళా నేతతో అర్ధనగ్నంగా మాట్లాడుతున్న వీడియో కాల్‌ రికార్డింగ్‌ని జనం ముందు ఉంచారు. రాఘవన్ పైకి కనిపించేంత మంచి వాడని కాదని.. గతంలోనూ ఎంతో మంది మహిళా నేతల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపించారు. పలువురు మహిళా నేతలతో ఆయన అసభ్య చేష్టలను రికార్డు చేశానని.. బీజేపీకి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని మదన్ పేర్కొన్నారు. అతడి వికృత చేష్టల వల్ల బాధితులైన ఎందరో గృహిణులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మొత్తం 60 వీడియోలు విడుదల చేస్తానని బాంబు పేల్చారు మదన్. ఇప్పుడీ వ్యవహారం తమిళనాట దుమారం రేపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)