నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజులు నైట్‌ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం కోరింది.  రాష్ట్రంలో కొవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ అందించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 వ్యాక్సిన్‌ డోసులు అందాయన్నారు. కరోనా టీకాల్లో ఇంకా 8,65,500 వరకు డోసులు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,82,49,851 కరోనా డోసులను ఇచ్చినట్టు సీఎం వెల్లడించారు. సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులను ఆదా చేసినట్టు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)