విలువ లేని సున్నాలు

Telugu Lo Computer
0


కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కృష్ణుడిని యుద్ధం లో తమకు సహాయం చేయమని అడిగారు. అందుకు ఆయన మీరిరువురూ నాకు కావలసిన వారే.అంటూ నేను ఒక్కడినీ ఒకవైపు, నేను ఆయుధము పట్టను, యుద్ధము  చేయను. ఊరికే సలహాలు యిస్తూ వుంటాను. నా 10,000 ల అక్షౌహిణు ల సైన్యం ఒకవైపు. మీకేది కావాలో కోరుకోండి . అని అంటాడు.అప్పుడు అర్జునుడు నాకు నీవోక్కడుంటే చాలు బావా అని కృష్ణుడినే కోరుకున్నాడు, దుర్యోధనుడు ఈ కంచి గరుడసేవ నాకెందుకు అని సైన్యాన్ని అంగీకరించి సంతోషంగా వెళ్ళాడు. అర్జునుడు దైవ బలాన్ని నమ్మినవాడు.10,000 ల సంఖ్యలో మొదటి ఒకటి దేవుడు (కృష్ణుడు) అది తీసేస్తే మిగతా ఎన్ని సున్నాలు వున్నా దానికి విలువ లేదు  అని తెలిసిన అర్జునుడు సుజ్ఞాని. దైవ బలం కంటే కంటికి కనబడే అంగబలమే ముఖ్య మనుకున్న దుర్యోధనుడు అజ్ఞాని, మూర్ఖుడు . అందుకే ఓడిపోయాడు. భగవంతుడు అనే ఆ 'ఒకటి'  లేకపోతె ప్రాపంచిక సుఖాలన్నీ విలువ లేని సున్నాల్లాంటివి. అందుచేత మనం భగవంతుని అనుగ్రహం సంపాదించట ముఖ్యం.  

Post a Comment

0Comments

Post a Comment (0)