రాజ్‌ కుంద్రా అరెస్ట్‌

Telugu Lo Computer
0


ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను అశ్లీల చిత్రాలకి సంబంధించిన కేసులో ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్‌ కుంద్రాను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముంబయి పోలీస్‌ కమిషనర్‌ ఆఫీసుకి తీసుకెళ్లారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. అశ్లీల చిత్రాలకి సంబంధించి ఫిబ్రవరిలో నమోదైన ఒక కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రాను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని నగ్రాలే చెప్పారు. అశ్లీల చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి ఫిబ్రవరిలో ముంబయి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)