ఉత్తమోత్తమం...í

Telugu Lo Computer
0

కొత్తగా పెళ్లయిన ఓ జంట ఓరోజు డిష్యుమ్ డిష్యుమని దెబ్బలాడేసుకుంటారు.
వెంటనే కటీఫ్ చెప్పేసుకుని ఒకళ్ళతో ఒకరు మాట్లాడడం కూడా మానేస్తారు.
కానీ నిత్య జీవితంలో ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం వస్తుందిగా.
"ఇవాళ నేను ఆఫీసు నుంచి రావడం లేట్ అవుతుంది "
"వచ్చేటప్పుడు రెండు కూరలు పట్టుకురండి"
ఇలాంటివి అన్నీ Post It స్లిప్పుల మీద రాసి ఫ్రిడ్జ్ డోరుకి అంటించేవాళ్లు.
ఒకరోజు మొగుడు "నేను రేపు పొద్దున్నే 8 గంటల ఫ్లైట్ కి చెన్నై వెళ్ళాలి. అలారమ్ పెట్టుకుంటా కానీ నాది మొద్దు నిద్రని నీకు తెలుసుగా. అందుకని నన్ను పొద్దున్న 5 కి లేపు" అని రాసి నోట్ ఫ్రిడ్జ్ తలుపుకి అంటించి గురక పెట్టి నిద్రోతాడు.
మర్నాడు పొద్దున్న లేచి టైం చూస్తే ఏడున్నర! వెంటనే పిచ్చి కోపంతో పెద్ద నోట్ పెళ్ళాన్ని కసాపిసా తిడుతూ రాసి ఫ్రిడ్జ్ డోరుకి అంటిస్తూంటే అతని కంట పడుతుంది పెళ్ళాం నోట్.
"ఐదయ్యింది. లేవండి" అని రాసుంటుంది ఆ నోటులో.
ఇది నేను కమ్యూనికేషన్ ట్రైనింగ్ లో చెప్తాను. ఇందులో నీతి ఏమిటంటే రాత పూర్వకంగా పంపిన ఏ సందేశం అయినా అది కేవలం వన్ వే! అది లెటర్ , SMS, వాట్సాప్, ఈమెయిల్ ఎలా పంపినా సరే.
ఆ సందేశం అవతలి వ్యక్తి చూసారో లేదో తెలీదు. చూసినా వాళ్ళకి అర్ధం అయిందో లేదో తెలీదు. మనం వాళ్ళకి ఏదైనా పని చేయమని రాస్తే అది వాళ్ళు చేస్తారో లేదో, చేద్దామనుకుంటున్నారో లేదో తెలీదు.
అందుకని ముఖ్యమైన విషయాలు అయితే మాత్రం ప్రత్యక్షంగా కానీ, ఫోన్ ద్వారా కానీ చెప్పడం ఉత్తమోత్తమం.

Post a Comment

0Comments

Post a Comment (0)