ఆరోగ్యానికి హాని !

Telugu Lo Computer
0


వైరస్ బారి నుండి కాపాడుకోవడానికి ఈ పౌడర్ చెంచా నీటిలో కలుపుకొని తాగండి, మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ ట్యాబ్లేట్ ను వాడండి. అని ఊదరకొడుతూ ప్రకటనలను రోజూ చూస్తున్నాము. వీటిని మార్కెట్లోనే కాకుండా ఆన్లైన్ ద్వారా అమ్మకాలను కొనసాగిస్తున్నారు. వ్యాధిని తట్టుకోవడానికి మన శరీరాన్ని సహజంగా సిద్ధం చేసుకోవాలి గానీ ఒకటి రెండు రోజుల్లో  రోగ నిరోధక శక్తి రాదనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా భయాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆయుర్వేదం, అలోపతి ముసుగులో మార్కెట్లోకి వివిధ రూపాలలో వచ్చి చేరుతున్నాయని, వీటికి  ఎటువంటి శాస్త్రీయత లేదని చెబుతున్నారు. దీర్ఘకాల వాడకముతో కాలేయం, మూత్రపిండాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పోషకాహారం, సరైన నిద్ర, వ్యాయామం వ్యాధి  నిరోధక శక్తిని పెంచుతాయని, కేవలం విటమిన్లు తీసుకోవడం వలన కరోనా సోకదనేది అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)