ప్రజా వైద్యునికి సాయం

Telugu Lo Computer
0


ప్రకాశం జిల్లా కారంచేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు  డాక్టర్ భాస్కరరావు వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి నుండి 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. డాక్టర్ భాస్కరరావు వైద్య ఖర్చుల విషయాన్ని  మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సిఎం నిధులు మంజూరు చేయమని ఆదేశించారు. 

 కారంచేడు పిహెచ్ సిలో వైద్య సేవలందిస్తున్నారు. దాదాపు 6 వేల మందికి ఆయన కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఎంతోమంది పేషెంట్లు ఆయన అందించిన వైద్యంతో కోలుకున్నారు. కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే ఏప్రిల్ 24న ఆయన వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేరారు.ఆయుష్ ఆస్పత్రిలో 10 రోజుల చికిత్స తర్వాత హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి ఆయన్ను షిఫ్ట్ చేశారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిందేనని... ఇందుకోసం రూ.1.50 కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. భాస్కరరావు కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆశ్రయించి సాయం కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)