కథ కన్నీరు పెడుతోంది!

Telugu Lo Computer
0


తన జీవితాన్ని కథ కోసం ధారవోసిన కథా తపస్వి కాళీపట్నం రామారావు మాస్టారు వెళిపోయారు.. కథకు కడసారి వీడ్కోలు పలికి ఈరోజు ఉదయం వెళ్ళిపోయారు. లెక్కలు మాస్టారుగా పనిచేసిన ఆయన_ కథను కన్న కూతురులా పెంచుకున్నారు. ఎక్కడెక్కడో ఉన్న కథలన్నిటినీ చేరదీసి, వాటికొక ఇల్లు కట్టారు. అదే శ్రీకాకుళంలోని "కథానిలయం." ప్రపంచంలోని ఏ మూలనున్న తెలుగు రచయితలైనా కనపడని ఏ కథ ఆచూకీ కావాలన్నా _ ఈ కథానిలయం నీడలో ఆరా తీయొచ్చు. కచ్చితంగా అక్కడ ఏదొక మూలన దొరికి తీరుతుంది. కథకు ఇంత రక్షణ ఉంటుందని భరోసా కల్పించిన కథా సంరక్షకుడు కారా మాస్టారు. అందుకే_ కథ కన్నీరు పెడుతోంది, కారా మాస్టారు లేరని.. ఇక మళ్ళీ రారని.

#ప్రజాశక్తి సాహితీ సంస్థ 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన సాహిత్య సంచిక దర్పణం కోసం మేము కారా మాస్టారిని కలిశాము. ఇంటర్వూ అడిగాము. చాలా మృదువైన గొంతులో ఒక్క అక్షరం కూడా పొల్లు పోని పద్ధతిలో డిక్టేషన్ తరహాలో ఆయన అభిప్రాయాలు చెప్పారు. మళ్ళీ తిరిగి రాసే శ్రమ లేదు. అవే వాక్యాలు, పదాలు అలాగే కంపోజై ఈ ఇలా దర్పణంలో అచ్చయ్యాయి. ఒక్క మాటా మీరని మనిషి. కథ కోసమే బతికిన మనిషి. ఆయన స్మృతికి నివాళి.. అక్షరాంజలి. _ సత్యాజీ

Post a Comment

0Comments

Post a Comment (0)