నటి వనిత కౌంటర్

Telugu Lo Computer
0

 

ప్రముఖ నటుడు విజయ్‌కుమార్‌ కుమార్తె దక్షిణాదిలో తెరకెక్కిన పలు చిత్రాల్లో నటించారు నటి వనితా విజయ్‌కుమార్‌. ప్రస్తుతం కెరీర్‌పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గత కొంతకాలం నుండి  వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే  మూడు  పెళ్లిళ్లు చేసుకున్న ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు  తీసుకున్నారు. కాగా, వనిత త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనుందంటూ గత కొన్నిరోజులుగా కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలను ఖండిస్తూ వనిత ‘ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇకపై ఇలాగే ఉంటాను. దయచేసి, నా జీవితం గురించి అసత్య వార్తలు వ్యాప్తి చేయకండి. ఆ వార్తలు కూడా నమ్మకండి. నా జీవితం ఎవ్వరికీ సమస్య కాదు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉన్నాయి వాటి గురించి చూడండి. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వాళ్లు.. నా గురించి కాకుండా మీ జీవితం గురించి బాధపడండి’ అని అన్నారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)