వార్నీ.... ఇంత సులభమా!

Telugu Lo Computer
0


అది కాశీపట్నం అక్కడ కాశయ్య కొరోనాకు మందు కనిపెట్టానని నాటుమందు ఇచ్చుకుంటున్నాడు...* దీనిని తమ స్వార్ధం కోసం పాపులారిటీకి ఉపయోగించు కోవాలని కొందరు రంగప్రవేశం చేసారు.. ఇంతలో మీడియా, ఒక లైకుకింత అనే డబ్బు చేసుకొనే యూట్యూబు వీరులు రంగ ప్రవేశం చేసి దానికి రాత్రికి రాత్రే మహా మందుగా చేసారు..,

*ఇక మొదలైంది రేసు,, ఎవడికి వాడు తమెక్కడ ఎనక బడతామో అని అదేపాటందుకున్నారు..* అన్ని పత్రికలు, ఛానళ్ళు అదే వార్త.. కవరేజులే కవరేజులు.. ఇది చూసి రాజకీయ నాయకులు అందులో తలపెట్టారు.. అధికార ప్రతిపక్ష నాయకులు రేసులోకి దిగారు.. మత, కుల సంఘాలు రంగం లోకి దిగి అది మందు కాకుండా జాతీమసమస్య అయినట్లు ఊదరగొట్టారు.. *సందట్లో సడేమియా అని వాడవాడలా బ్లాక్ మార్కెటింగు గాళ్ళు నాటుమందును కూడా అమ్మసాగారు...*
*రాజకీయ రంగు వచ్చినాక ఊరుకుంటుందా... ప్రభుత్వమే ఇవ్వాలని కొందరు, దినుసులివ్వాలని కొందరు, బడ్జెట్ కేటాయించాలని కొందరు, అందరు ఇవ్వాలంటున్నారని ఇది మందే, ఇస్తారా లేదా అని ప్రభుత్వం పై వత్తిడి తేసాగారు...*.
ప్రజలు ప్రాణభయంతో ఉన్నారు..90% ఏమి లేకున్నా బాగవుతారు.. 10% ఆసుపత్రి లో బాగవుతారు..1% చనిపోతారు.. ఈ 1% లో 0.6% ప్రభుత్వ ఆసుపత్రి లో..0.4% ప్రైవేటులో చేరతారు.. *ఇందులో కొందరు 0.1% మాకెక్కవ బిల్లేసారో..మమ్మల్ని దోచుకున్నారో.. వీళ్ళు నాశనం గాను అని సోషియల్ మీడియాలో అరవసాగారు...* ఇది చూసి అందరూ తమంతా కార్పొరేట్ లో చేరినట్లు తమా ఆస్తులన్ని పోబోతాయని ఊహించుకొని చదువులన్నీ చట్టిబండలుకాగా, ఏ విజ్నానం లేకుండా, చదివినోడికన్నా వాడెవడో మేలన్నట్లు *ఐ లైకు నాటుమందు* అని అరవసాగారు.. కొందరు మేధావులు, పాత రిటైర్డు అధికారులు బయటకొచ్చి ప్రభుత్వాలదే తప్పు.. అందరికీ అన్నీ కల్పించలేదు.. ఏదో బ్రతకడానికి బ్లాక్ మార్కెటు చేసుకుంటారు..అని అరవసాగారు.. ప్రజలు ఈ లైను బాగుంది అని అరవసాగారు.....
*ఇంతమందితో ఓట్లేపిచ్చుకుని పదవి చేబట్టిన నాయకుడు కెంత మేధస్సుంటాది.. అందరికీ ఆ మందు ఇస్తే రెండువిధాల లాభం... ప్రజలడిగిందే ఇచ్చామన్న మంచిపేరు... ప్రతిపక్షాల నోటికి కళ్ళెం..*. కోవిడ్ కేర్ సెంటర్ లు మూసేసి ఈ మందు వేసు కోమంటే బోలెడు డబ్బు ఆదా... ప్రజలు మాకు ఆక్సిజన్ కావాలని, మందులు కావాలని గట్టిగా అడిగితే కష్ఠం గాని నాటుమందు ఇవ్వడమెంత సేపు... *కాని రాజ్యాంగ పరంగా చిక్కుంది,.* ఇది శాస్త్రీయపరంగా నిర్ధారించలేదు కావున రేపు మరణాలు సంభవించినా, ఓవర్ కాన్ఫిడెన్సువల్ల కేసులు పెరిగినా జాతీయ అంతర్జాతీయ మీడియా ఓ ఆట ఆడుకుంటుంది...
*అశ్వత్ధామ హతః కుంజరః...* అనే విధానం తెరపైకి తెచ్చారు... పైన ఉన్న నాయకుల వత్తిడితో దీనినే శాస్త్రీయం చేస్తే పోలా అనుకున్నారు.. శాస్త్రజ్ఞులు ను పిలిపించారు.., *శాస్త్రమిది శాస్త్రమిది పరమం పవిత్రం..* అని మంత్రం చదవమన్నారు.. ఈ గోంగూరపప్పు వండి ప్రయోగశాలకు పంపారు.. అందులో ఎలాగూ ఏముండదు,, *కాని కొరోనా కు మందంటే నిరూపించలేం.. పోనీ ప్రయోగం చేసేకి ధైర్యం లేదు...* రాజుమెచ్చే దగ్గర దారి ఎన్నుకున్నారు.. *ఒక వేయి మందికి ఫోన్లు చేసి,,హలో ..హలో.. మీరు తిన్నారా... బాగుందా.. అని పది చిలక ప్రశ్నలడిగి.. అదే పరిశోధనగా పైకి పంపారు*..
*వార్నీ వెయ్యిమంది ఫోన్లో బాగుంది అంటే శాస్త్ర మైపోయేటట్లుండే సంవత్సరం రోజులు 2 DG కోసం కష్టపడి నామే అని రక్షణరంగ నిపుణులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు..,*
*అసలు 10 ప్రభుత్వ ఆసుపత్రి లలో వైద్యుల నందరిని బయటకు పంపి, ఆయుర్వేద వైద్యులచే పేషెంట్లకు నచ్చచెప్పించి, కన్సెంటు తీసుకొని , 10 ఆసుపత్రి లలో 100 మంది చొప్పున 1000 మందిని శాంపిల్ గా తీసుకుని ఆక్సిజన్ పెట్టిన వారిని తీసుకుని, వారి ఆక్సిజన్ తీసేసి,. ఈ మందు కంట్లో వేసి,,,ఎంత మోతాదులో వేసాము,. ఎంత శాతం పెరిగింది.. ఎంత కాల వ్యవధి లో వెయ్యాల.. ఇంప్రూవు కాకుంటే మరలా ఆక్సిజన్ ఎంతమందికి పెట్టారు, ఎంతమందికి బాగయ్యారు... అని కంప్యూటర్ ద్వారా రికార్డు చేసి పరిశోధనలు పంపాల,,, అంతే కాని ఈ ఫోనులో పరిశోధనలేంటని పక్కదేశం వారు ఆశ్చర్యం ప్రకటించి స్పృహ కోల్పాయారు,,,,*
*ప్రజలేం కోరితే అది ఇచ్చినట్లు ఇస్తే అది శాస్త్ర విజ్ఞానం అయిపోదు...* అడగకుండానే అన్నీ ఇవ్వడం కాదు.. వాడవాడలా, స్కూల్సులలో రికవరీ సెంటర్ లు పెట్టాల..సిలెండర్ లు అందుబాటులో ఉంచాల, మందులుంచాల.. మాకేమన్నా అవసరమైతే ఆక్సిజన్ దగ్గర లో అందుబాటులో ఉందని భరోసా కలిపించాల..
*అంతే కాని ప్రజలడిగారులే అని దగ్గర దారి ఎంచుకుంటే రేపు మరలా వారే విమర్సిస్తారు...*
Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు

Post a Comment

0Comments

Post a Comment (0)