జూన్ లో 12 కోట్ల టీకా డోసులు

Telugu Lo Computer
0


జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 6.9 కోట్ల డోసుల టీకామందులను ఉచితంగా అందజేస్తామని వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికీ ఈ టీకామందులు వేస్తారని, ఇది పూర్తిగా ఉచితమని స్పష్టం చేసింది. ఆ తరువాత రాష్టాలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులకు 5.86 కోట్ల డోసుల వ్యాక్సిన్ లభ్యమవుతుందని, అడ్వాన్సుగా ఈ కేటాయింపు ఉంటుందని వివరించింది. వ్యాక్సిన్ వృధా కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కోరింది. మే నెలలో 7,94,05 200 డోసుల టీకా మందులను ఈ కార్యక్రమం కోసం నిర్దేశించినట్టు కేంద్ర తెలిపింది. ఇప్పటివరకు ఇండియాలో 21.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. 

వ్యాక్సిన్ కొరత నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. త్వరలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం సంబంధిత కంపెనీతో చర్చలు జరుగుతాయని అధికారవర్గాలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)