ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తేలేదు !

Telugu Lo Computer
0


ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, ప్రజ్వల్ ఏ దేశానికి వెళ్లినా, అతను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ దాక్కున్నా అతన్ని మాత్రం కర్ణాటకకు తీసుకువస్తామని, లేదంటే ఆయనే భారతదేశానికి తిరిగిరావాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాశామని సీఎం సిద్దరామయ్య అన్నారు. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విషయమై శుక్రవారం బాగల్‌కోట్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అంతర్జాతీయంగా పర్యటించాలనప్పుడు పాస్‌పోర్టు, వీసాలను తనిఖీ చేస్తారని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎవరూ దేశం వెలుపలకు వెళ్లలేరని, ఎవరూ దేశం వదిలి వెళ్లిపోరాని సిద్దరామయ్య అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందని సిద్దరామయ్య పరోక్షంగా ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో మాట్లాడిన కుమారస్వామి నేను వేరు కాదు, ప్రజ్వల్ రేవణ్ణ వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని హాసన్ లో చెప్పి ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు అందరూ రాజకీయాలు, పలు చర్యలు కలిసి చేసేవని సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణను మాత్రం వదిలే ప్రసక్తేలేదని, ఆయన్ను సిట్ అధికారులు విచారణ చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. హుబ్బళిలో కాలేజ్ అమ్మాయి నేహా హత్య లవ్ జిహాద్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై స్పందించిన సిద్దరామయ్య మండిపడ్డారు. అమిత్ షా రాజకీయాలు చెయ్యడానికి ఇలాంటి ప్రకటన చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. నేహాని హత్య చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని సిద్దరామయ్య గుర్తు చేశారు. తరువాత నేహా కేసును సీఐడీకి అప్పగించామని, కేసు విచారణ వేగవంతం చెయ్యడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామని సిద్దరామయ్య అన్నారు. నేహా హత్య కేసులో నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)