వైసీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాయగా, ఆ లేఖను శాసన మండలికి పంపారు. వైసీపీని వీడిన ఈయన మైనార్టీల ద్రోహి జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే రెండ్రోజుల్లో ఈయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.రాయలసీమ జిల్లాకు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత శనివారం ఆయన నేరుగా నంద్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడే మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల ద్రోహి జగన్ అని, ప్రభుత్వంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే బై జూన్ భారీ స్కాం, లిక్కర్ మరో భారీ స్కాం.. ఇలా ఎన్నో చేసుకుంటూ పోతున్నారన్నారు. మైనార్టీలకు వైసీపీలో సముచిత స్థానం దక్కడం లేదన్నారు. సీఏఏపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, దానికి మద్దతు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైసీపీలో గౌరవం లేకపోవడంతోనే బయటకు వచ్చినట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ప్రజలు సంక్షేమం గా ఉండాలంటే వ్యవస్థలలో మార్పు రావాలని, మైనారిటీ హక్కుల పరిరక్షణకు, ప్రజల సంక్షేమం కోసం వీటన్నిటికి న్యాయం చేకూరాలంటే చంద్రబాబు లాంటి నాయుడు రాష్ట్రానికి అవసరమన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మరో రెండ్రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీలో చేరగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మైనార్టీలకు వైసీపీ చేస్తోన్న ద్రోహాలను వివరిస్తానని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)