దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ శాస్త్రవేత్తల నౌకను అడ్డుకున్న చైనా !

Telugu Lo Computer
0

క్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ కు చెందిన శాస్త్రవేత్తల బృందంతో ఉన్న నౌకను సైనిక హెలికాఫ్టర్‌తో కలిసి చైనా కోస్ట్‌గార్డ్‌ నౌక అడ్డుకుంది. దీంతో కొన్ని గంటలపాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి చెందిన ఈ నౌకలు సముద్రంలోని ఇసుక దిబ్బల ప్రాంతంలో పరిశోధనల కోసం శాస్త్రవేత్తలను తీసుకెళుతున్నట్లు ఆ దేశ ప్రతినిధి తెలిపారు. నౌకకు దగ్గరగా వచ్చి తమను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాగా, ఈ ఆరోపణలను చైనా ఖండించింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉండే ఇసుక దిబ్బల ప్రాంతంలో 34 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చైనా కోస్ట్‌గార్డ్‌ గుర్తించింది. వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని పలుమార్లు హెచ్చరించినట్లు చైనా అధికారి గాన్‌ యు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఫిలిప్పీన్స్ తోసిపుచ్చింది. ''చైనా కోస్టుగార్డు మరో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. సుమారు 4 గంటల పాటు మా నౌక సమీపానికి వచ్చి హారన్‌ మోగిస్తూ, సైనిక హెలికాఫ్టర్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మా శాస్త్రవేత్తల పరిశోధనను అడ్డుకున్నారు'' అని ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి జైటర్రీలా తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)