మేడిగడ్డపై శ్వేతపత్రం విడుదల !

Telugu Lo Computer
0


తెలంగాణ అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందని, అక్టోబర్ లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదని విమర్శలు గుప్పించారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ మ్యారేజ్ దెబ్బతిందన్నారు. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదని ఆరోపించారు. స్వతంత్ర భారతంలో ఇంత అవినీతి జరగేలదని, మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదన్నారు. అన్నారం బ్యారేజ్‌కు కూడా పగుళ్లు వచ్చాయని, అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయని తెలిపారు. బ్యారేజ్‌లో నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోందిని, ఉన్న నీటిని తొలగించమని తెలిపిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)