టీడీపీ 94, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన !

Telugu Lo Computer
0


టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవాళ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. జనసేన 24 సీట్లలో ఐదుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. మిగిలిన 19 మంది క్యాండిడేట్ల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ 94 మంది, జనసేన ఐదుగురితో కలిపి ఇవాళ మొత్తం 99 మంది క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేశారు. జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. టీడీపీ-జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ఖరారు అయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. బీజేపీతో పొత్తు, సీట్లు సర్ధుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)