పప్వా న్యూ గునియాలో హింస : 64 మంది మృతి

Telugu Lo Computer
0


ప్వా న్యూ గునియా దేశంలో జరిగిన హింసలో 64 మంది మృతి చెందారు. ఆ దేశంలోని పర్వత శ్రేణుల్లో ఉండే రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పర్వత ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వర్గ పోరు నడుస్తోంది. గత వారం జరిగిన హింస మరీ దారుణమని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఆ దీవిలోకి  ఆయుధాలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్థానిక గిరిజన తెగల మధ్య ఘర్షణ మొదలైంది. రాజధాని పోర్ట్ మోర్సీబీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాబాగ్ పట్టణంలో ఎక్కడ చూసినా మృత దేహాలు కనిపిస్తున్నాయి. ఆ మృత దేహాలను పోలీసులు సేకరిస్తున్నారు. హైల్యాండ్స్ ప్రాంతంలో జరిగిన హింసలో ఇదే అతి పెద్ద ఘటన అని అధికారి జార్జ్ కాకస్ తెలిపారు. హింసాత్మక ఘటనకు చెందిన గ్రాఫిక్ వీడియోలు పోలీసులకు చేరాయి. కాల్పుల జరిగిన ప్రాంతానికి చెందిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ట్రక్కుల్లో మృతదేహాలను లోడ్ చేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. భూమి, సంపద కోసం గిరిజనుల మధ్య గొడవలు జరుగుతోంది. అయితే గత ఏడాది జూలై నుంచి మూడు నెలల పాటు ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ కూడా విధించారు. హింస నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ, ట్రావెల్ ఆంక్షలు విధించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)