టీమిండియాకి 5 పరుగుల పెనాల్టీ !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ మూడో టెస్టులో భారత జట్టుకి 5 పరుగుల పెనాల్టీ విధించారు అంపైర్లు...దీంతో ఇంగ్లాండ్ 5/0 నుంచి ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది. పిచ్‌కి వికెట్ల ముందు ఉండే ఏరియాని డేంజర్‌ జోన్‌గా పిలుస్తారు. ఈ ఏరియాలో నడిచినా, పరుగెత్తినా పిచ్ డ్యామేజ్ అయ్యి, స్పందించే విధానం మారుతుంది. ఎక్కువగా బౌన్స్ అవ్వడం జరిగి, ఆటగాళ్లకు గాయాలు కూడా అవుతాయి. అయితే డేంజర్ జోన్‌లో రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినా భారత బ్యాటర్లు పట్టించుకోలేదు. తొలి రోజు డేంజర్ జోన్‌లో పరుగెత్తిన రవీంద్ర జడేజాకి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. రెండో రోజు రవిచంద్రన్ అశ్విన్ కూడా డేంజర్ జోన్‌లో పరుగెత్తడంతో 5 పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయంపై రవిచంద్రన్ అశ్విన్ చాలా సేపు అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది.


Post a Comment

0Comments

Post a Comment (0)