మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదు !

Telugu Lo Computer
0
భారత్-మాల్దీవుల వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఐదు రోజుల పర్యటన ముగించుకుని సొంతదేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదని, మమ్మల్ని వేధించే లైసెన్స్ మీకు ఇవ్వబడలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే మయిజ్జూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.. ''మేము చిన్న వారమే కావచ్చు, కానీ అది మమ్మల్ని బెదిరించే లైసెన్సు మీకు ఇవ్వదు'' అని పరోక్షంగా ఇండియాను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి, అక్కడి అందమైన బీచుల్ని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఉద్దేశిస్తూ అక్కడి ముగ్గురు మంత్రులు విధూషకుడు, ఇజ్రాయిల్ కీలుబొమ్మ అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇది వివాదానికి ఆజ్యం పోసింది. భారతీయులు మాల్దీవుల్ని బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ''బాయ్ కాట్ మాల్దీవ్స్'' అంటూ ట్రెండ్ చేశారు. చాలా మంది భారతీయలు, మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అక్కడి హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ క్యాన్సల్ చేసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పర్యాటక, హోటల్ రంగం భారత్‌కి క్షమాపణ చెప్పింది. అయితే మాల్దీవ్స్ ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రుల్ని సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. 



Post a Comment

0Comments

Post a Comment (0)