దేశంలో కొత్తగా 760 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి కరోనా సోకింది. జేఎన్‌-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4423కు చేరింది. కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) తెలిపింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)