దేశంలో 2083 కరోనా జేఎన్.1 కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో ఇప్పటి వరకు కరోనా జేఎన్.1, దాని తెగలకు సంబంధించిన కేసులు 2,083 వరకు నమోదయ్యాయని ఇన్సాకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ ) సోమవారం వెల్లడించింది.18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జేఎన్.1 జన్యుపరమైన సార్స్ కొవి2 కేసులు 814 నమోదు కాగా, దాని ఉప తెగల కేసులు 943 వరకు నమోదయ్యాయని ఇన్సాకాగ్ వివరించింది. వీటిలో జేఎన్1.11 కేసులు 244 కాగా, మిగతావి ఉప తెగ జేఎన్.1 కేసులు. కరోనా జేఎన్.1 సబ్‌వేరియంట్ ఇంతకు ముందు బిఎ.2.86 సబ్ లీనియేజెస్ లోని వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్ (విఒఐ)గా వర్గీకరించడమైంది.ఇది వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ దీని ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)