పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా ఓటమి

Telugu Lo Computer
0

దుబాయ్‌ వేదికగా అండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌ బ్యాటర్లలో అజాన్ అవైస్(105 నాటౌట్‌) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు సాద్‌ బైగ్‌ (68 నాటౌట్‌), షాహజిబ్‌ ఖాన్‌(63) పరుగులతో పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. బౌలర్లలో మురగన్‌ అభిషేక్‌ ఒక్కడే రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కాగా అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)