తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్ !

Telugu Lo Computer
0


తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే డీజీపీ సస్పెండ్ అవ్వడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే డీజీపీ అంజనీ కుమార్‌ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే డీజీజీ రేవంత్ రెడ్డిని ఎలా కలుస్తారని ఈసీ సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి ఫలితాలు రాక ముందే.. రేవంత్ రెడ్డిని కలిసినందుకు గాను ఆయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అందువల్లనే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై అంజనీ కుమార్ ఏ విధంగా స్సందిస్తారో చూడాల్సి ఉంది. డీజీపీ అంజనీ కుమార్ పై వేటు పడటంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ షాక్‌కు గురైంది. అయితే ఈ సస్పెన్షన్ ఎన్నిరోజుల పాటు ఉంటుందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్నికల ఓట్ల లెక్కంపు ఓ వైపు జరుగుతుండగానే.. డీజీపీ.. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడమే ఈ సస్పెన్షన్‌కు కారణం అయ్యింది. అంజనీ కుమార్ వెంట మహేశ భగవత్, సంజయ్ కుమార్ జైన్, కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ పుష్పగుచ్ఛం అందించి విషెస్ తెలిపారు. రేవంత్‌కు భద్రత కల్పించే అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు అర్హత ఉన్న సీనియర్ పోలీస్ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వేటు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)