ఆంధ్రప్రదేశ్ లో జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఏర్పాటు !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ 'జై భారత్‌ నేషనల్‌' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని, దానిని తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్‌ నేషనల్‌ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశానని, అన్నివర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నట్టు వివరించారు. రాజకీయాలు అంటే మోసం కాదని, సుపరిపాలన అని పేర్కొన్నారు. 'వీళ్లు తిన్నారని వాళ్లు.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించాను.. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జై భారత్‌ నేషనల్‌ పార్టీ' అని లక్ష్మీనారాయణ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)