చంద్రమోహన్‌ మృతికి ప్రధాని మోడీ సంతాపం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 11 November 2023

చంద్రమోహన్‌ మృతికి ప్రధాని మోడీ సంతాపం

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. సినీ ప్రపంచానికి అతను ఒక తేజస్సు అని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన చేశారు. చంద్రమోహన్‌ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. చంద్రమోహన్‌ నటనా వైభవం, అద్వితీయమైన జనాకర్షణ శక్తి కొన్ని తరాలపాటు సినీ ప్రేక్షకులను ఉల్లాసపరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన మరణం సినీ లోకాన్ని శూన్యంలోకి నెట్టేసిందని, చంద్రమోహన్‌ లేని లోటును పూడ్చటం చాలా కష్టమని రాసుకొచ్చారు. చంద్రమోహన్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చివరగా 'ఓం శాంతి' అంటూ తన సందేశాన్ని ముగించారు.

No comments:

Post a Comment