క్రికెట్ థీమ్ తో గూగుల్ స్పెషల్ డూడుల్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 19 November 2023

క్రికెట్ థీమ్ తో గూగుల్ స్పెషల్ డూడుల్ !


సీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా గూగుల్ తన హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను షేర్ చేసింది. క్రికెట్ థీమ్ తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ డూడుల్ ఇప్పుడు నెటిజన్లు, క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్ లో గూగుల్... క్రికెట్ లో ఉపయోగించే 22 గజాల పిచ్ పై గూగుల్ అనే అక్షరాల్లోనే ట్రోఫీ, క్రికెట్ బ్యాట్ ఉంచింది. అంతేకాకుండా ఈ డూడుల్ పై క్లిక్ చేస్తే అది వరల్డ్ కప్ కు సంబంధించిన వెబ్ సైట్ల వివరాల పేజ్ లోకి తీసుకెళ్లేట్టుగా దీన్ని రూపొందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో 1.32 లక్షల మంది అభిమానుల మధ్య ఈ రోజు ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ట్రోఫీ కోసం తలపడబోతున్నాయి. టీమిండియా మూడో వరల్డ్ కప్ కోసం చూస్తుండగా.. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ స్టేడియంలో అత్యధిక మంది చూసిన క్రికెట్ మ్యాచ్ గా రికార్డు క్రియేట్ చేయబోతోంది.

No comments:

Post a Comment