ఇతర రాష్ట్రాల పర్యాటక వాహనాలకు పన్ను మినహాయింపు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 17 October 2023

ఇతర రాష్ట్రాల పర్యాటక వాహనాలకు పన్ను మినహాయింపు !


ర్ణాటకలో ఆసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మైసూరు, కృష్ణరాజ సాగర (కెఆర్‌ఎస్ డ్యాం)ను సందర్శించే ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటక వాహనాలకు పన్ను మినహాయింపులను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆయా రాష్ట్రాలలో రోడ్డు ట్యాక్సు చెల్లించే పర్యాటక వాహనాలు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 24 వరకు మైసూరు, కెఆర్‌ఎస్ డ్యాంను సందర్శించిఏ సమయంలో ఎంట్రీ ట్యాక్సు చెల్లించాల్సిన అవసరం లేదని కర్నాటక రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మైసూరు నగరానికి, మాండ్య జిల్లా శ్రీరంగపట్నలోని కెపిఎస్ డ్యాంకు దసరా ఉత్సవాల కోసం వెళ్లే పర్యాటక వాహనాలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని రవాణా శాఖ తెలిపింది. పన్ను మినహాయింపులు పొందడానికి ప్రత్యేక పర్మిట్లు తీసుకోవలసి ఉంటుందని తెలిపింది. ఈ పన్ను మినహాయింపు వల్ల కేరళ, తమిళనాడు వచ్చే నుంచి పర్యాటక వాహనాలు ఎక్కువగా లబ్ధిపొందుతాయని కర్నాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హుల్లా తెలిపారు. దసరా ఉత్సవాల కాలంలో ప్రతి రోజు దాదాపు 2,000 ట్యాక్సీలు, 1,000 మ్యాక్సీ క్యాబ్‌లు, 300 టూరిస్టు బస్సులు మైసూరులోకి ప్రవేశిస్తాయని ఆయన అంచనా వేశారు. ట్యాక్సీలకు ఎంట్రీ ట్యాక్సుగా రూ.300, మ్యాక్సీ క్యాబ్‌లకు రూ.1800 నుంచి రూ. 2,000 (బస్సులకు రూ. 15,000 వరకు (వాటి సీట్ల సంఖ్యను బట్టి) ఉంటుందని ఆయన చెప్పారు. ప్రవేశం కోసం వసూలు చేసే ఈ ట్యాక్సు ఏడురోజుల పాటు చెల్లుబాటు అవుతుందని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment