యూట్యూబర్ హర్షసాయి హీరోగా సినిమా !

Telugu Lo Computer
0


యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యూట్యూబర్ లలో హర్ష సాయి ఒకరు. ఎక్స్పరిమెంటల్ వీడియోలు చేస్తూ పేదలకు సహాయం చేస్తున్నట్లుగా ఉండే వీడియోలు చేసే ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చూసి ఆయన పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఆయన వీడియోలో రావడం తగ్గాయి. ఈ సమయంలోనే ఆయన ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా హర్ష సాయి సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈ నెల 17వ తేదీన జరగబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్లో వందల మంది ఒక పెద్ద గంట చుట్టూ చేరి చూస్తున్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా నిర్మాతల విషయానికి వస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాని సమర్పిస్తుండగా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేసి కొన్నాళ్లలోనే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిన మిత్ర శర్మ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమెకు సంబంధించిన శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కి నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అంటే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ టీజర్ లాంచ్ జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మిత్ర శర్మ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్టర్ షేర్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)