నిర్లక్షం చేస్తే ఐపీఎస్ లను వదలం !

Telugu Lo Computer
0


ర్ణాటకలో అన్ని ప్రాంతాల్లోని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో అక్రమ కార్యకలాపాలు, అక్రమ వ్యవస్థీకృత నేరాలు జరుగుతుంటే డీసీపీ, ఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీనియర్ పోలీసు అధికారుల వార్షిక సదస్సులో సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. ఇదే సమయంలో సీఎం సిద్దరామయ్య పోలీసు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మోరల్ పోలీసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కారణాలను సహించబోదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని మా ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. పోలీసు ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. తప్పుడు వార్తలు, వదంతుల ద్వారా సమాజంలో శాంతికి భంగం కలిగించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. సున్నితమైన కేసుల్లో ఫిర్యాదుదారులు వచ్చే వరకు వేచి చూడవద్దని, పోలీసులు ముందుగా చర్చలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. బెంగళూరు సీసీబీని మరింత పటిష్టం చేసేందుకు కొత్తగా 230 మంది సిబ్బందిని నియమించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవసరమైతే సిబ్బందికి కొత్త భవనాలు నిర్మిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీసు అధికారులకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు అధికారులకు హితబోధ చేశారు. ప్రజలతో మమేకం కాకపోతే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని, ప్రజలతో కలసిమెలసి ఫ్రెండ్లీగా ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ అధికారుల దృష్టికి కేసులు తీసుకురాకుండా ఎలాంటి నేరాలు చేసిన వారితో డీల్ కుదుర్చుకోకూడదని, చీకటి వ్యాపారాలు జరగకుండా చూడాలని, వాటి విషయంలో నిర్వక్షం చేస్తే అధికారుల మీద చర్యలు తప్పవని, సీనియర్ పోలీసు అధికారులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే పేద, సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పోలీస్ వ్యవస్థను రూపొందించాలని అధికారులకు సీఎం సిద్దరామయ్య సూచించారు. ఈ సందర్భంగా కర్ణాటక హోమ్ డాక్టర్ జీ. పరమేశ్వర్, అదనపు ముఖ్య కార్యదర్శి రజనీష్ గోయల్, కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి గోవిందరాజులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)