బీఎస్‌వీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌కు శంకుస్థాపన

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ భారత్‌ సీరమ్స్‌ అండ్ వ్యాక్సిన్స్ (బీఎస్‌వీ) ఏర్పాటు చేస్తున్న మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో శంకుస్థాపన జరిగింది. ఈ ప్లాంట్‌ను 10 ఎకరాలలో కంపెనీ నిర్మానం కానుంది. దీని కోసం రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్‌తో తమ ఇంజెక్ట్‌బుల్స్‌ (ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించే మందులు) కెపాసిటీ పెరుగుతుందని బీఎస్‌వీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఫేజ్‌ 2 లో మరిన్ని ప్రొడక్ట్‌లను ఇక్కడ తయారు చేస్తామని తెలిపింది. బీఎస్‌వీ ఉమెన్ హెల్త్‌కేర్‌, క్రిటికల్ కేర్‌లో వాడే వివిధ మందులను తయారు చేస్తోంది. మొత్తంగా 145 బ్రాండ్‌లను తయారు చేస్తోంది. బీఎస్‌వీ తమ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. జెనోమ్ వ్యాలీ ఆఫర్ చేస్తున్న ఎకోసిస్టమ్‌కు, అవకాశాలకు ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని, ప్రోత్సహిస్తోందని బీఎస్‌వీ సీఈఓ సంజీవ్‌ నవంగల్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)