మహ్మద్ సిరాజ్‌ రికార్డు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 September 2023

మహ్మద్ సిరాజ్‌ రికార్డు !


కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. కేవలం 16 బంతుల్లోనే సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వన్డే మ్యాచులో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంక  ప్లేయర్‌ చమిందా వాస్ పేరిట రికార్డు ఉంది. 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ కూడా 16 బంతుల్లోనే ఐదు వికెట్లను తీశాడు. దీంతో ఇప్పుడు అతడి రికార్డును సిరాజ్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మహ్మద్ సిరాజ్ తన రెండో ఓవర్‌లో విశ్వరూపం చూపించాడు. ఓకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. మొదటి బంతికి పాథుమ్ నిశాంక (2; 4 బంతుల్లో) ను ఔట్ చేయగా మూడో బంతికి సదీరా సమరవిక్రమ(0)ను ఎల్భీ డబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగో బంతికి అసలంక (1) ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. ఐదో బంతిని ఫోర్‌గా మలిచిన ధనుంజయ డిసిల్వా (4) ఆఖరి బంతికి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 12 పరుగులు మాత్రమే చేసింది. తరువాతి ఓవర్‌లోనూ లంక కెప్టెన్ దసున్ షనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. కేవలం 16 బంతుల్లోనే 29 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ పేసర్ ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు.

No comments:

Post a Comment