నాకు ఆ హోటల్ సూట్‌లో నిద్ర రాదు !

Telugu Lo Computer
0


నంద్ మహీంద్రా మాల్దీవుల్లోని ఖరీదైన సూట్ వీడియోను షేర్ చేశారు. మురాకా మాల్దీవుల్లోని ఈ సూట్ ప్రపంచంలోనే మొట్ట మొదటి నీటి అడుగున ఉన్న హోటల్ సూట్ అట. వీకెండ్‌లో ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి ఇది మంచి ప్లేస్ అట. నవంబర్ 2018 లో ఈ సూట్‌ను ప్రారంభించారు. ఇది సముద్ర మట్టానికి 16 అడుగుల లోతులో ఉంటుందట. ఇది హిల్టన్ కాన్రాడ్ మాల్దీవ్స్ రంగాలి ఐలాండ్ రిసార్ట్‌లో ఒక భాగం అట. ఇక్కడ ఒక రాత్రి బస చేయాలంటే $50,000 (సుమారు రూ. 41 లక్షలు) ఖర్చవుతుందట. ఆనంద్ మహీంద్రా 'మురాకా మాల్దీవులు ప్రపచంలోనే మొట్టమొదటి నీట అడుగున హోటల్ సూట్. ఇక్కడ ఉండడం వల్ల వారాంతపు విశ్రాంతి చాలా ప్రశాంతంగా ఉండాలనే సూచనతో నాకు ఈ పోస్ట్ పంపారు. నిజం చెప్పాలంటే నాకు ఈ సూట్‌లో నిద్ర వస్తుందని అనుకోను. గ్లాస్ సీలింగ్ పగుళ్లు వెతుకుతూ నేను మెళకువగా ఉంటాను' అనే శీర్షికతో పోస్ట్ చేశారు. నిజంగానే గ్లాసు పగుళ్లు చూసుకుంటే మెళకువగా ఉండాలని, ఆక్సిజన్ మాస్క్ లు పెట్టుకుని ఇక్కడ హనీమూన్ చేసుకోవాలని చాలామంది నెటిజన్లు ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)