యాదాద్రికి ఎంఎంటీఎస్‌ ?

Telugu Lo Computer
0


ఎంఎంటీఎస్‌ రెండోదశ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది చివరకు పూర్తికానున్నాయి. ఈమేరకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దక్షిణమధ్య రైల్వే కార్యాచరణలో నిమగ్నమైంది. మౌలాలి నుంచి చర్లపల్లి వరకు అధికారులు మూడో లైను నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ప్రతిరోజు యాదగిరిగుట్టకు 10వేల మంది భక్తులు వెళుతున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రీమోడల్ పనులు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్‌ రెండోదశ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో నిధులు మంజూరు చేయించడంలో సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. రీజనల్‌ రింగురోడ్డును ఆనుకుని రైల్వే లైన్లు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు సిద్ధం కాకముందే యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే కేవలం రూ.20 టిక్కెట్‌తో యాదాద్రికి వెళ్లొచ్చు. ప్రస్తుతం నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పడుతోంది. మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మరో గంట అదనంగా పడుతుంది. ఎంఎంటీఎస్ లో అయితే 45 నిముషాల్లోపు వెళ్లిపోవచ్చు. యాదాద్రిని తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని ఆరు సంవత్సరాల కిందటే నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ రైళ్లను రాయగిరి వరకు పొడిగించాలని రైల్వేకు సూచించింది. ఇందుకయ్యే ఖర్చులో మూడింట రెండు వంతులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఎంత ఖర్చవుతుందనే విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారులు నివేదిక ఇచ్చారు. ఆరు సంవత్సరాల క్రితం లెక్కల ప్రకారం రూ.330 కోట్లుగా అంచనా వేశారు. రూ. 220 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా అంగీకారం కుదిరింది. టెండర్లు పిలవడానికి రైల్వే సిద్ధమైనప్పటికీ రాష్ట్రం నుంచి వాటా నిధులు అందకపోవడంతో ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. యాదాద్రికి నగరం నుంచి వెళుతున్న భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ పనులపై దృష్టి పెట్టారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)