మంగ్లీ కాలికి గాయం !

Telugu Lo Computer
0


మంగ్లీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రైవేట్ సాంగ్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది. తక్కువ టైంలోనే ఇప్పటికే దాదాపు 100కి పైగా సాంగ్స్ పాడింది.  నటిగా కూడా పలు సినిమాలు నటించింది. ప్రతి పండగకు ఒక ప్రైవేట్ సాంగ్ పాడి స్పెషల్ వీడియో షూట్ చేయించి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా బోనాలపై ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తుంది. ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి గాయం అయిందని సమాచారం. దీంతో యూనిట్ వెంటనే మంగ్లీని హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారని, మంగ్లీని కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని తెలిపినట్టు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)