చెన్నైలో చిరు జల్లులు !

Telugu Lo Computer
0


గత కొన్ని రోజులుగా వడగాడ్పులతో ఇబ్బంది పడుతున్న చెన్నైవాసులు సోమవారం సాయంత్రం కురిసిన చిరు జల్లులకు సాంత్వన పొందారు. వచ్చే నాలుగు రోజుల పాటు అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ వేసవికాలంలో పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదువుతున్న విషయం తెల్సిందే. ఆదివారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. చెన్నైతో పాటు 15 ప్రాంతాల్లో సూర్యతాపం తీవ్రస్థాయిలో ఉంది. దీంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చెన్నై నగరంలో ఇప్పటివరకు చూడని వేసవి ఎండలను మే నెలలో నగర వాసులు చూశారు. ఈ జూన్‌ నెల తొలి రెండు రోజుల పాటు వాతావరణం చల్లబడినప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి ఎండల తీవ్రంగా మరింత ఎక్కువ గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)