మంచి నీళ్ల బావిలో కొండ చిలువ

Telugu Lo Computer
0


తెలంగాణలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంచి నీళ్ల కోసం మంగళవారం మహిళలు బావి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే బావిలో బారీ కొండ చిలువ పొరపాటున పడిపోయింది. బయటికి రాలేక కొండ చిలువ నీళ్లలోనే ఉండిపోయింది. దీంతో నీళ్ల కోసం వచ్చిన స్థానికులు బావిలో కొండ చిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురై కేకలు వేశారు. స్థానిక సర్పంచ్‌ అబ్బు ప్రకాశ్‌రెడ్డి బావి వద్దకు చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను బావి నుంచి వెలుపలకు తీశారు. అనంతరం దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)