టైటాన్ సబ్‌మెర్సిబుల్ లోని ఐదుగురు బిలీనియర్లు మృతి

Telugu Lo Computer
0


టైటానిక్ శిథిలాలను చూసేందుకు ప్రజల్ని తీసుకెళ్లే టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం బయల్దేరి అట్లాంటిక్ సముద్రంలో తప్పిపోయిన విషయం తెలిసిందే. నీటిలోకి వెళ్లిన ఒక గంట 45 నిమిషాలకు కాంటాక్స్ కోల్పోయిన ఈ వాహనం జాడ తెలుసుకునేందుకు,అందులో ఉన్న ఐదుగురు బిలీనియర్లను కాపాడేందుకు అట్లాంటిక్ మధ్యలో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. టైటాన్ లో కేవలం 96గంటలకు సరఫడా ఆక్సిజన్ నిల్వలే ఉండటంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. రెండు రోజుల నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలింపు చేపట్టినప్పటికీ దాని జాడ దొరకలేదు. అయితే ఆ శబ్దాలు టైటాన్ కు సంబంధిచినవి  కాదని తర్వాత తెలిపింది. అయితే తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు మరణించారని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించనట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు తెలిపింది. పాకిస్తాన్ బిలీయనీర్ షెహజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19), యూఏఈలో ఉండే బ్రిటన్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, ఈ యాత్ర నిర్వహకుడు, ఓషన్ గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టాక్టర్ రష్..ఈ జలాంతర్గామిలో వెళ్లి మరణించారని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలకు తెలిపినట్లు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)